Telangana - Tourism | నేటి నుంచి నల్లమల్ల కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం
Telangana - Tourism | నేటి నుంచి నల్లమల్ల కృష్ణమ్మ ఒడిలో లాంచీ ప్రయాణం
కార్తీక మాసం బంపర్ టూర్ ప్లాన్
అధికారికంగా ప్రకటించిన మంత్రి జూపల్లి
Hyderabad : రాష్ట్రంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా క్రష్టమ్మ నదిలో లాంచీ ప్రయాణం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పర్యాటక శాఖ భక్తులకు అద్భుతమైన పర్యాటక ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రమణీయమైన ప్రకృతి అందాలతో కూడిన ఆధ్యాత్మిక యాత్రను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. దేశంలోనే ప్రఖ్యాత జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలానికి పర్యాటక విభాగం మంచి ఆఫర్లు అందిస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ అయిన సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభిస్తుంది.అందుకు సంబంధించి శుక్రవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి క్రష్ణారావు పూర్తి వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణ ప్యాకేజీని కూడా ప్రకటించింది.
కృష్ణ మ్మ ఒడిలో, నల్లమల అడవుల పచ్చదనం, వాటికి చెందిన అందాలను వీక్షిస్తూ.. కృష్ణా నదిలో సాగే జల విహారానికి తెలంగాణ పర్యాట క శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
లాంఛీ టూర్ ప్యాకెజీ వివరాలు ఇలా ఉన్నాయి : సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జున సాగ ర్ నుంచి శ్రీశైలం వరకు సింగిల్ రైడ్ తో పాటు రౌండప్ క్రూయిజ్ జర్నీ ధరలను నిర్ణ యించారు. ఈ రెండు వేర్వేరు ప్యాకేజీల కు ఒకే రకమైన టికెట్ ధరలు వర్తిస్తాయని ప్రకటించారు. సింగిల్ జర్నీలో పెద్దల కు రూ. 2000, పిల్లలకు రూ.1,600, రౌండప్ (రానుపోను కలిపి) జర్నీలో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ. 2,400 గా ధరలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో లాంచీ ప్రయాణంతో పాటు టీ, స్నాక్స్ కూడా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు టిక్కెట్ బుకింగ్ కోసం https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సంప్రదించి, పూర్తి వివ రాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.
* * *
Leave A Comment